యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి పట్ల టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గొప్ప మనసుచాటుకున్నారు. మెరుగైన వైద్యం కోసం సకాలంలో ఆస్పత్రికి తరలించారు.
మానవత్వాన్ని చాటుకున్న టెస్కాబ్ వైస్ ఛైర్మన్ - road accidents in yadadri district
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా జేసి మానవత్వాన్ని చాటుకున్నారు టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మానవత్వాన్ని చాటుకున్న టెక్సాస్ వైస్ ఛైర్మన్
మహేందర్ రెడ్డి ఆలేరుకు వెళ్తుండగా వరంగల్ హైవేలో వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద.. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన రాచర్ల లక్ష్మణ్.. కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన మహేందర్ రెడ్డి తన కారును ఆపి పరామర్శించి వైద్యం కోసం వేరొక కారులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:హాథ్రస్‌కు వెళ్లేందుకు రాహుల్ యత్నం.. ప్రత్యక్షప్రసారం