రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు... ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో షాద్‌నగర్‌కు చెందిన శాంతమ్మ, శేఖరయ్య దుర్మరణం చెందారు.
బస్సు ఢీ కొట్టి ఇద్దరు కూలీలు దుర్మరణం - బెంగళూరు జాతీయ రహదారిపై ఇద్దరు కూలీలు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో... ఇద్దరు మృతి చెందారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ కూలీలను ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టడం వల్ల ఘటన చోటుచేసుకుంది.

బస్సు ఢీ కొట్టి ఇద్దరు కూలీలు దుర్మరణం