పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్నానని స్నేహితులతో చెప్పిన విద్యార్థిని బావిలో శవమై తేలింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భిల్యా నాయక్ తండాకు చెందిన దారవత్ శోభన్, జ్యోతి కుమార్తె చిత్ర.. స్థానిక జడ్పీ హై స్కూల్లో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక.. పుస్తకాలు తరగతి గదిలో పెట్టి తన స్నేహితురాలితో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. అనంతరం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు తెలిపారు.
బావిలో దూకి పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య - భిల్యానాయక్ తండాలో విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భిల్యానాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
విద్యార్థిని ఆత్మహత్య, భిల్యానాయక్ తండా
విద్యార్థిని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి