నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో వ్యక్తి ఆత్మహత్య ఘటనలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు నెలల కింద ఇదే గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్... ఆదివారం గ్రామంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు నుంచి మృతదేహం కిందకు దించకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యావనందిలో కొనసాగుతోన్న ఉద్రిక్తత - Nyavanandi crime news
నిజామాబాద్ జిల్లా న్యావనందిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
న్యావనందిలో కొనసాగుతోన్న ఉద్రిక్తత
మమత హత్య కేసులో అసలు నిందితులను వెంటనే అరెస్టు చేసి రెండు కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థులు, మహిళా సంఘాలు అక్కడే బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పినా గ్రామస్థులు వినలేదు. ఈరోజు ఆర్డీవో గ్రామానికి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహం తరలించేది లేదని చెబుతున్నారు. రెండు రోజులుగా మృతదేహం చెట్టుకు అలాగే ఉంది. గ్రామంలో పోలీసుల భారీగా మోహరించారు.