తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్​లో ఉద్రిక్తం - జగిత్యాల జిల్లా లేటెస్ట్​ వార్తలు

భాజపా కార్యకర్తల అరెస్ట్​తో జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్​ బయటకు వెళ్లేందుకు కాషాయ శ్రేణులు యత్నించారు. గేట్​ లాగేందుకు యత్నిచటంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

tension at gollapalli police station in jagityala district
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్​ వద్ద ఉద్రిక్తత

By

Published : Dec 30, 2020, 7:24 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి భాజపా కార్యకర్తలు బయటకు వెళ్లేందుకు యత్నిచటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గేట్​ లాగేందుకు ప్రయత్నంచిటంతో కాషాయ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. భాజపా కార్యకర్తలు పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.

ఫ్లెక్సీల విషయంలో గత కొద్ది రోజులుగా భాజపా, తెరాస మధ్య వివాదం సాగుతోంది. బుధవారం మంత్రి కొప్పల ఈశ్వర్​ పర్యటనను అడ్డుకునేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమవటంతో అక్కడికి చేరుకున్న గులాబీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి దాడి చేసుకున్నారు. అక్కడి చేరుకున్న పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

గొల్లపల్లి పీఎస్​కు పెద్ద ఎత్తున చేరుకున్న ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. లోపలున్న వారు బయటకు రావడానికి యత్నించటంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, సీఐలు గొల్లపల్లికి చేరుకుని పరిస్థతిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

గొల్లపల్లి పోలీస్‌స్టేషన్​ వద్ద ఉద్రిక్తత

ఇదీ చదవండి:లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..

ABOUT THE AUTHOR

...view details