చైతన్యపురి తెరాస ఉపాధ్యక్షుడి ఇంట్లో మద్యం సీసాలు - undefined
17:04 November 30
చైతన్యపురి తెరాస ఉపాధ్యక్షుడి ఇంట్లో మద్యం సీసాలు
తెరాస అభ్యర్థి మద్యం పంపిణీ చేస్తున్నారంటూ... భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. చైతన్యపురి డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు.. ఎన్నికల అధికారికి భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేపట్టగా... శ్రీనివాస్ ఇంట్లో, కారులో మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితర నేతలు అక్కడికి చేరుకున్నారు.
తెరాస అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెరాస కార్యకర్తలు భాజపా కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కార్యాలయం తెరిచారంటూ ఆందోళన చేపట్టగా... పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇదీ చూడండి :ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి