సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి... రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్‌కు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ 35 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. జేపీ మార్గన్ అనే సంస్థ లండన్ నుంచి చెన్నైకి 10 టన్నులకు పైగా వెండిని చేరవేసింది. అక్కడి నుంచి చిత్తూరు మీదుగా బ్రింక్స్ సెక్యూరిటీ సంస్థ సహకారంతో రెండు కంటైనర్ల ద్వారా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మహేంద్రహిల్స్‌లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్‌కు ఈ వెండిని చేర్చాల్సి ఉంది.
అనుమానంతో తనిఖీలు
భారీ కంటైనర్లు అక్కడికి వెళ్లడం కష్టమని ఉద్దేశంతో రెండు చిన్న చిన్న కంటైనర్లలో తరలించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే పోలీసులు వారిని గుర్తించారు. పెద్దమొత్తంలో ఉన్న వెండిని... కనీస సమాచారం లేకుండా తరలిస్తుండటాన్ని అనుమానించిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.