రాఖీ పండగ రోజు ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 10 లక్షలు విలువచేసే బంగారం, వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ సమీపంలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ కుటుంబం... రాఖీ పండుగ సందర్భంగా సమీపంలో ఉన్న గౌరీశంకర్ కాలనీలో వాళ్ల చిన్నాన్న శివప్రసాద్ ఇంటికి వెళ్లారు.
రాఖీ పండగ రోజు ఇంట్లో చోరీ - jadcharla news
రాఖీ పండగ రోజు ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 10 లక్షలు విలువచేసే బంగారం, వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది.
రాఖీ పండగ రోజు ఇంట్లో చోరీ
రాత్రి 9 గంటలకు ప్రేమ్ కుమార్ వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరచి ఉండడం... బీరువాలో సామగ్రి చిందరవందరగా పడగా... చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న రెండు లక్షల 90 వేల నగదు, 22 తులాల బంగారం, ఇతర ఆభరణాలు ఉన్నాయని వాటి విలువ రూ. ఏడు లక్షల 70 వేలు ఉంటుందని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.