కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదురునూరు గ్రామానికి చెందిన కోరెపు ఎల్లయ్య రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మలేసియా వెళ్లాడు. అక్కడే ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఊపిరితిత్తులలో సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎల్లయ్య.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మలేసియాలో తెలుగువాసి మృతి.. - Telugu man died in Malaysia
పొట్టకూటి కోసం మలేసియా వెళ్లాడు. అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. డబ్బు చెల్లించందే స్వదేశానికి మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వడం లేదు ఆ ఆసుపత్రి యాజమాన్యం. చికిత్సకే రూ.2 లక్షల ఖర్చయిందని కడచూపు చూసుకునేందుకు చిల్లిగవ్వ కూడా చేతిలో లేదని ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. మృతదేహం స్వగ్రామానికి రావాలంటే రూ.లక్షా ముప్పై వేలు ఖర్చవుతోందని, సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మలేసియాలో తెలుగువాసి మృతి..
డబ్బు చెల్లిస్తేనే ఎల్లయ్య మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. చికిత్స కోసం రెండు లక్షల రూపాయల వరకు డబ్బు పంపించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి దాదాపు లక్షా యాభైవేల రూపాయలు ఖర్చవుతుందని, తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదని వాపోయారు. ప్రభుత్వమే స్పందించి తమకు సాయం చేయాలని, ఎల్లయ్య మృతదేహాన్ని భారత్కు తీసుకురావాలని కోరారు.