రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ.1,794 కోట్ల జరిమానాను విధించారు. భారీగా జరిమానాలు విధించినా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడంలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు పరిశీలిస్తే... ప్రమాదాలతో పాటు మరణాలు పెరిగాయి.
సంవత్సరం | ప్రమాదాలు | మరణాలు |
2014 | 20,078 | 6,906 |
2015 | 21,252 | 7,110 |
2016 | 22,811 | 7,219 |
2017 | 22,484 | 6,596 |
2018 | 22,230 | 6,606 |
2019 | 21,570 | 6,964 |