విద్యార్థినులను వేధించడం, అసభ్య చిత్రాలు, సందేశాలు పంపిన ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్‌పై పలువులు విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ తరగతుల పేరిట రాత్రి సమయాల్లో తమ పిల్లలకు విద్యార్థినులకు తరచూ ఫోన్ చేసి వేధించడం, వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు పంపుతున్నాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్, డీఈవో ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు.
విద్యార్థినులకు తరచూ ఫోన్లు..అసభ్య సందేశాలు - siddipet crime news
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో కీచక ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆన్లైన్ తరగతుల పేరిట రాత్రి సమయాల్లో తమ పిల్లలకు విద్యార్థినులకు తరచూ ఫోన్ చేసి వేధించడం, వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు పంపుతున్నాడన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

విద్యార్థినులకు తరచూ ఫోన్లు..అసభ్య సందేశాలు
విద్యార్థినులను వేధించడం నిజమేనని విచారణలో వెల్లడయింది. ఉపాధ్యాయుడు శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు హుస్నాబాద్ మండల విద్యాధికారి మారంపల్లి అర్జున్ తెలిపారు.