తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దారుణం: బావమరుదులే బలి తీసుకున్నారు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

సొంత కుటుంబ సభ్యులే.. నిండు ప్రాణాలు బలితీసుకున్నారు. ఆస్తి తగాదాలతో కత్తిగట్టి.. నిర్దాక్షిణ్యంగా కత్తితో నరికేశారు. బావ మంచి కోరే బావమరుదులే పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం మండపం గ్రామంలో జరిగింది.

MURDER
దారుణం: బావమరుదులే బలి తీసుకున్నారు..!

By

Published : Dec 7, 2020, 4:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మండపం గ్రామానికి చెందిన వీరబాబు అనే తెలుగుదేశం కార్యకర్తను సోమవారం ఉదయం కత్తితో నరికి చంపేశారు. బావమరుదులే అతన్ని చంపేశారని మృతుని బంధువులు అంటున్నారు. సోమవారం ఉదయం పాల వ్యాపారానికి వెళ్తుండగా దారి కాసి.. వేట కొడవళ్లతో దాడి చేశారు.

గత కొంతకాలంగా మృతుడికి, తన బావమరుదులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. వారం క్రితం వీరబాబు తమ కుటుంబ సభ్యులకు రావలసిన డ్వాక్రా సొమ్ము ఇవ్వడం లేదని అన్నవరం పోలీస్ స్టేషన్​లో బావమరుదులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోనందున ఈ ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. తన వాడని కూడా చూడకుండా వేట కొడవళ్లతో నరికి చంపారని ఆవేదన చెందుతున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బావమరుదులే బలి తీసుకున్నారు..!

ఇదీ చదవండి:అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!

ABOUT THE AUTHOR

...view details