ఆల్టోకార్ను ఢీ కొట్టిన టాటా ఏస్ వాహనం - Tata Ace vehicle that hit the Alto car
టాటా ఏస్ వాహనం ఆల్టోకార్ను ఢీ కొట్టిన ఘటన మెహిదీపట్నం పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 36 వద్ద చోటుచేసుకుంది.
Hyderabad accident latest news
మెహిదీపట్నం పీవీఎన్ఆర్ పిల్లర్ నంబర్ 36 వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం వల్ల రోడ్డు పక్కన డీసీఎం మరియు దాని వెనుక ఆల్టోకార్ నిలిపి ఉంచారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ టాటా ఏస్ వాహనం ఆల్టోకార్ను ఢీ కొట్టింది. దీనితో ఆల్టోకార్ డీసీఎంను ఢీకొన్నది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆల్టోకార్ పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.