తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిషేధిత జిలెటిన్​స్టిక్స్, డిటోనేటర్స్​ను పట్టుకున్న పోలీసులు

పేలుళ్లకు ఉపయోగించే నిషేధిత జిలెటిన్​స్టిక్స్, డిటోనేటర్స్​ను నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. 202 జిలెటిన్​స్టిక్స్, 100 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Oct 27, 2020, 10:45 PM IST

taskforce police seized detonator's in nizamabad district
నిషేధిత జిలేటిన్​స్టిక్స్, డిటోనేటర్స్ పట్టుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో నిషేధిత జిలెటిన్​స్టిక్స్, డిటోనేటర్స్​ను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో టాస్క్​ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు.

తనిఖీల్లో 202 జిలెటిన్​స్టిక్స్, 100 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్​ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, సిబ్బంది తనిఖీ చేసి నిషేధిత పదార్థాలు పట్టుకున్నారు. వీటిని నిల్వ ఉంచిన వ్యక్తి పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి:కోడి కూర వండలేదని భార్యను హతమార్చిన భర్త...

ABOUT THE AUTHOR

...view details