తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఫంక్షన్​ హాల్​లో పేకాట.. రూ.16.40 లక్షలు స్వాధీనం - cards players arrest

ఫంక్షన్​ హాల్​లో పేకాట.. రూ.16.40 లక్షలు స్వాధీనం
ఫంక్షన్​ హాల్​లో పేకాట.. రూ.16.40 లక్షలు స్వాధీనం

By

Published : Jun 13, 2020, 7:36 PM IST

Updated : Jun 14, 2020, 2:11 PM IST

19:33 June 13

ఫంక్షన్​ హాల్​లో పేకాట.. రూ.16.40 లక్షలు స్వాధీనం

 వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 14 మందితో పాటు రూ. 16.40 లక్షల నగదు, చారవాణీలు స్వాధీనం చేసుకున్నారు. సుబేదారిలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్​లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వారిపై... పక్క సమాచారంతో టాస్క్​ఫోర్స్, స్థానిక పోలీసులు దాడులు చేశారు. వీరంతా వరంగల్, హన్మకొండకు చెందిన వారుగా గుర్తించారు. లాక్​డౌన్ కారణంగా ఖాళీగా ఉంటున్న ఫంక్షన్ హాల్​ యజమానికి అద్దె చెల్లించి... కొన్ని రోజులుగా వీరు పేకాట ఆడుతున్నట్టు తెలుస్తోంది. 

Last Updated : Jun 14, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details