నారాయణపేట జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మక్తల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో పనుట్ల బాలరాజు ఇంట్లో 36 బస్తాలు, 18 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ దాడులు... పీడీఎస్ బియ్యం పట్టివేత - Narayapet District news
వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వఉంచిన పీడీఎస్ బియ్యాన్ని నారాయణపేట జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
![టాస్క్‌ఫోర్స్ దాడులు... పీడీఎస్ బియ్యం పట్టివేత వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9789161-533-9789161-1607309293702.jpg)
వేర్వేరు చోట్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
బొలెరో వాహనంలో అమరచింత నుంచి గుర్మిట్కల్కు 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా చందాపూర్ శివారులో స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి:కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి