నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతోపాటు రెండు వెయింగ్ మిషన్లు సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్ఫెక్టర్ షాకిర్ అలీ చెప్పారు.
'రేషన్ బియ్యం అక్రమ రవాణాను సహించేది లేదు' - crime news in nizamabad district
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లో జరిగింది.
రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ఎవరైనా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.