మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై... శుక్రవారం అర్ధరాత్రి 8 టాక్టర్లతో పాటు జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
మొరం ట్రాక్టర్ల పట్టివేత.. జేసీబీ స్వాధీనం - తెలంగాణ వార్తలు
బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
బెల్లంపల్లిలో మొరం ట్రాక్టర్లు పట్టివేత
ఈ ఘటనలో భాగంగా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరాన్ని తరలిస్తే కేసులు తప్పవని టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:కార్మికుడిని ఢీకొన్న కంటైనర్... తీవ్ర గాయాలు