నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఊట్కూరు ఎస్సై రవి తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్ల సీజ్ - narayanapet district latest news
నారాయణపేట జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వాహనాలను పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్ల సీజ్
మరోవైపు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను నారాయణపేట్ రోడ్లో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.