హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతంలో అక్రమంగా జర్దా తయారు చేస్తున్న స్థావరంపై మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిందితుడు సోహైల్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు 3 లక్షల విలువ చేసే 100 కిలోల జర్దా, 5000 వేల ఖాళీ జర్దా డబ్బాలు, 2 తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
జర్దా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి... 3 లక్షల సరుకు స్వాధీనం - illegal jardha comany in hyderabad
హైదరాబాద్ పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో అక్రమంగా జర్దా తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకున్ని అరెస్టు చేసిన పోలీసులు... సుమారు 3 లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు.
task force police raids on illegal jardha company
నిందితుడు సులువుగా డబ్బు సంపాదన కొరకు బయట నుంచి జర్దాను తీసుకొచ్చి వేరు వేరు పేర్లతో అక్రమంగా తయారు చేసి పాన్ షాపులు, దుకాణాల్లో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుతో నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.