సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రెండు దాబాలపై కార్యదళం, సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారంలో దాడులు చేశారు. మండలంలోని విష్ణు, వైష్ణవి దాబాల యజమానులు కరుణాకర్, రాజులను, మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
దాబాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు.. యజమానులు అరెస్ట్ - సిద్దిపేట సమాచారం
అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారంతో దాబాలపై టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రెండు దాబాల యజమానులను, మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
దాబాలపై కార్యదళం పోలీసుల దాడులు
అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకై దాబాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు కార్యదళం సీఐ ప్రసాద్ వెల్లడించారు. అక్రమంగా బెల్ట్‌షాప్ నిర్వహించినా, మద్యం సేవించేందుకు అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో సీసీఎస్ సీఐ నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.