వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 10 మంది పేకాటరాయుళ్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22,670 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ నందీరామ్ నాయక్, గొర్రె మధు తెలిపారు.
మడికొండలో 10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
విశ్వసనీయ సమాచారంతో మడికొండ గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22,670 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
మడికొండలో 10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం పేకాటరాయుళ్లను మడికొండ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: అన్న వచ్చాడని తీసుకెళ్లాడు... భార్యని కొట్టి చంపాడు!