నిజామాబాద్ నగరంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో నిషేధిత తంబాకుతో గుట్కాను తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 100 బస్తాల తంబాకును స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా కేంద్రంపై దాడి.. వంద బస్తాలు స్వాధీనం - banned tobacco products caught in nizamabad
నిజామాబాద్ నగరంలో గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 బస్తాల నిషేధిత తంబాకును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్సై నరేంద్ర తెలిపారు.
![గుట్కా కేంద్రంపై దాడి.. వంద బస్తాలు స్వాధీనం banned tobacco products manufacturing in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8751961-550-8751961-1599740491133.jpg)
నిజామాబాద్‌లో గుట్కా తయారీ స్థావరంపై దాడి
సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 130 బస్తాల జర్దాను పట్టుకున్నట్లు నరేంద్ర తెలిపారు. ఈ దాడుల్లో వన్‌టౌన్ ఎస్సై ఆంజనేయులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.