సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఓ ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాడి చేసి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్టకు చెందిన సురేశ్, టెలీ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్న అహ్మద్, సోందు మియా, పలు హోటళ్లలో వంట మనిషిగా పనిచేస్తున్న సల్మాన్ కలిసి డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్ - latest news is the arrest of three people selling drugs
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 లక్షల విలువ చేసే మెఫిడ్రోన్ అనే మత్తు పదార్థంతో పాటు 7 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంబయి నుంచి ఒక్కో గ్రాము 2500 రూపాయలు చెల్లించి... హైదరాబాద్‌కు తీసుకొచ్చి వాటిని కవర్లలో ప్యాక్ చేసి ఒక్కో గ్రాముకు 5వేల చొప్పున విక్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం సల్మాన్, అహ్మద్ కలిసి కారులో ముంబయి వెళ్లి 10లక్షల రూపాయల విలువ చేసే మెపిడ్రోన్ అనే మత్తు పదార్థం తీసుకొచ్చారు. బోయిన్ పల్లిలోని ఓ ఇంట్లో ఉంచి ఒక్కో గ్రామును ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్‌ను నిందితులు పబ్‌ల వద్ద అవసరమైన వాళ్లకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు.
ఇదీ చదవండి:గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల రెండో జాబితా విడుదల