యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంటును టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీలోని కాకాజీ సిటీమాల్‌లో హజ్, ఉమ్రహ్ సర్వీస్‌లో సోదాలు నిర్వహించారు. యాత్రకు వెళ్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడం వల్ల తనిఖీలు చేశారు.
యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్ అరెస్ట్ - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ పాతబస్తీ లాడ్‌బజార్‌లోని కాకాజి సిటీమాల్పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఏజెంట్ షేక్ ముస్తఫా బిన్ హిండిని అదుపులోకి తీసుకున్నారు.
యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్ అరెస్ట్
నకిలీ ఏజెంట్ షేక్ ముస్తఫా బిన్ హిండి.. యాత్రికుల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కొవిడ్ పరీక్షల కోసమని 147మంది నుంచి 30వేల రూపాయలు వరకు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:బతుకు దెరువుకోసం వచ్చి.. బెట్టింగ్‌కు బలి