తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.10 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం..

నిషేధిత గుట్కా, విదేశీ సిగరెట్లు, పొగాకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే నిషేధిత సరుకును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను భవాని నగర్ పోలీసులకు అప్పగించారు.

Task Force Police Arrest Illegal Tobacco Smugglersv
రూ.10 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం.. నిందితుల అరెస్టు

By

Published : Oct 4, 2020, 9:14 PM IST

నిషేధిత గుట్కా, విదేశీ సిగరెట్లు, పొగాకు దుకాణాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే సరుకు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

చాంద్రాయణ గుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నసీబ్​ నగర్, ఫూల్​బాగ్​, భవాని నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఫతేషా నగర్​లో ఇద్దరు నిందితులు నిషేధిత గుట్కా, సిగరెట్లను సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు చేసి.. నిందితులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువ చేసే సరుకు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని.. చాంద్రాయణ గుట్ట, భవాని నగర్​ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు కసరత్తు

ABOUT THE AUTHOR

...view details