ఆదిలాబాద్ జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్, ఒకటో టౌన్ పోలీసుల సంయుక్త దాడుల్లో.. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ వెల్లడించారు.
నిస్సహాయులైన మహిళలచే..
పట్టణంలోని కైలాష్ నగర్ కాలనికి చెందిన ఓ మహిళతో కలిసి నిందితుడు జర్నలిస్ట్ కాలనిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టణ పోలీసుల సహాయంతో చాకచక్యంగా దాడులు నిర్వహించారు.