తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్​ - Lead robbery cases in hyderabad

ఈ నెల 22న జరిగిన దారి దోపిడీ కేసును హైదరాబాద్​ టప్పాచబుత్ర పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. 2 ద్విచక్రవాహనాలు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

tappachabutra police solved Lead robbery case
tappachabutra police solved Lead robbery case

By

Published : Sep 27, 2020, 8:58 AM IST

హైదరాబాద్​ కార్వాన్ రాంసింగాపూర్​లో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు, మరో బాల నేరస్థున్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22న రాత్రి 11గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని కొట్టి... చరవాణి, 2వేళ నగదును నిందితులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసిన టప్పాచబుత్ర పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందుతులను గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. రెండు ద్విచక్ర వాహనాలతోపాటు 2 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: కుటుంబ కలహం.. అన్నను హతమార్చిన చెల్లి

ABOUT THE AUTHOR

...view details