నాగర్ కర్నూల్ జిల్లా గడ్డంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నిర్మలయ్య, భాగ్యలక్ష్మి దంపతుల పిల్లలు సిద్దు, అమ్ములు అనుమానాస్పదస్థితిలో సంపులో పడి మృతి చెందారు.
కొంతకాలంగా దంపతుల మధ్య వివాదాలు ఉన్నాయి. భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలు తీసుకుని తల్లిగారి గ్రామమైన పెద్దాపూర్ కు వెళ్లింగి. మూడు రోజుల క్రితం నిర్మలయ్య భార్య వద్దకు వెళ్లి మాట్లాడాడు. భార్య నిరాకరించగా పిల్లలను తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు.