నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు బోధన్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
యువకుడి అనుమానాస్పద మృతి - బోధన్ లో యువకుడి మృతి
ఓ యువకుడు అనుమానస్పద స్థితి మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడి అనుమానస్పద మృతి
యువకుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. యువతి బంధువుపై యువకుడి బంధువులు ఆక్రోశంతో దాడికి దిగగా... ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కంఠం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.