తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యువకుడి అనుమానస్పద మృతి.. గొడవకు దిగిన కుటుంబ సభ్యులు - medak district crime news

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం స్కూల్ తండాకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హత్యేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ... దాడికి దిగారు.

యువకుడి అనుమానస్పద మృతి.. గొడవకు దిగిన కుటుంబ సభ్యులు
యువకుడి అనుమానస్పద మృతి.. గొడవకు దిగిన కుటుంబ సభ్యులు

By

Published : Sep 11, 2020, 10:53 PM IST

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం స్కూల్ తండాకు చెందిన యువకుడు మాలోత్ నవీన్​... గురువారం అనుమానాస్పదంగా చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం మెదక్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తండాకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాత కక్షలతో పథకం ప్రకారం చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.

మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానితులపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగి పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్లింది. విషయం తెలిసి హవేలి ఘనపూర్​ పోలీస్​ స్టేషన్​ ఏఎస్ఐ విఠల్​, ముగ్గురు కానిస్టేబుల్​లు స్కూల్​ తండాకు వెళ్లి వారిని ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనంపై వారు​ దాడిచేసి ధ్వంసం చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్ ఎఫెక్ట్.. జీతంలేక ఐమ్యాక్స్​లో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య..

ABOUT THE AUTHOR

...view details