నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో ఏడాదిన్నర బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాలుడి తల్లిపైనే అనుమానం ఉందని వారి బంధువులు ఆర్ముర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడు మృతి.. కోడలిపై మామ ఫిర్యాదు - nizamabad armoor updates
ఏడాదిన్నర బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తన మనుమడు ఫిట్స్ వల్ల చనిపోలేదని తన కోడలిపై అనుమానం ఉందని బాలుడి తాత ఆర్ముర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన రాజేందర్‌తో లౌక్యకి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బతుకు దెరువు కోసం రాజేందర్ దుబాయ్ వెళ్లాడు. ఏడాది నుంచి బాబుతో కలసి లౌక్య ఇసపల్లిలోనే ఉంటుంది. ఫిట్స్ వచ్చి బాబు చనిపోయాడని తన అత్తగారి ఊరైన మాక్లూర్ మండలం అమ్రాద్‌లో ఉంటున్న మామయ్యకు స్థానికులు సమాచారం ఇచ్చారు. బంధువులు తన మనుమడు ఫిట్స్ వలన చనిపోలేదని తన కోడలిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.