తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విష ప్రయోగంతో హోటల్ యజమాని హత్య - recent crime news in thallur

ఓ హోటల్ నిర్వాహకుడిపై విషంతో కూడిన పదార్థాన్ని స్ప్రే చేయటం వల్ల అతను మరణించిన సంఘటన గుంటూరు జిల్లా 75 తాళ్లూరులో చోటుచేసుకుంది.

suspicious-death-in-pedakurapadu-iat-guntur-district
ఏపీలో.. విష ప్రయోగంతో హోటల్ యజమాని హత్య

By

Published : Nov 5, 2020, 2:37 PM IST

గుంటూరు జిల్లా పెడకూరపాడు మండలం 75 తాళ్లూరులో భాష్యం బ్రహ్మయ్య హోటల్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి పదిన్నర సమయంలో హోటల్ వ్యర్థాలు, చెత్తను పడేసేందుకు బ్రహ్మయ్య వెళ్లారు. అప్పుడే ఆయన ముఖంపై.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విష పదార్థంతో కూడిన స్ప్రేను పిచికారి చేశారు. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details