తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - ఘట్ కేసర్ లో వ్యక్తి మృతి

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : Oct 2, 2020, 9:15 AM IST

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన గంగారం అంజయ్య ఘట్‌కేసర్‌లోని ఓ దుకాణంలో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు. ఓ వ్యక్తి నుంచి పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ రాగా...‌ పోలీసులు అంజయ్య ఇంటికి వచ్చారు.

అప్పటికే బాధితుడి తలకు, చేతికి గాయాలు ఉన్నాయి. చాపమీద పడి ఉన్న అంజయ్య చేతులపై పసుపు పొడి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరించినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. ఆత్మహత్యా లేక హత్య అనేది తేలాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఫీజుల చెల్లింపుపై 10 లక్షల మంది తల్లిదండ్రుల వెనకడుగు

ABOUT THE AUTHOR

...view details