హైదరాబాద్ నగర శివారులోని అత్తాపూర్ ముష్క్మహాలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం.. - గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
హైదరాబాద్ నగర శివారులోని అత్తాపూర్ ముష్క్మహాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
అనుమానాస్పద మృతదేహం లభ్యం.. కేసు నమోదు
గుర్తు పట్టలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా ఆ వ్యక్తి ఉత్తర ప్రదేశ్కు చెందిన బ్రిజులాల్గా గుర్తించారు. అతనిది హత్యా.. లేక సాధారణ మరణమా అనే విషయం తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :జలదిగ్బంధంలోనే హైదరాబాద్ శివార్లలోని కాలనీలు