హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పనిచేస్తున్న సత్యకృష్ణ అనే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దవాఖాన యాజమాన్యం మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గాంధీకి తరలించడంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రి యాజమాన్యం వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లిన సత్యకృష్ణ సాయంత్రం 5 గంటలకు చనిపోయాడని పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. బాత్రూంలో జారిపడి మరణించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని సత్యనారాయణ చెప్పారు.