సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డానం మహేశ్ (35).. శుక్రవారం శ్రీశైలం పవర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో పనిచేస్తున్న అతడు.. కంపెనీ పనిమీద శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లాడని మృతుని బందువులు తెలిపారు.
పవర్ హౌస్ అగ్నిప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి - సూర్యాపేట జిల్లా మద్దిరాలలో విషాదం
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మద్దిరాల వాసి మృతి చెందాడు.

పవర్ హౌస్ అగ్నిప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.