భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఇల్లందు, నర్సంపేట, గుండాల ఏరియా కమిటీ దళ సభ్యుడు ఎదుల్లా రామ్మూర్తి అలియాస్ అఖిలేశ్ అలియాస్ అగ్ని.. లొంగిపోయాడు. 2019 నవంబర్ నుంచి మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పార్టీలో చేరి కొంతకాలం ఆజాద్ వద్ద పని చేశాడని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. తర్వాత గుండాల నర్సంపేట దళ సభ్యుడిగా సాగుతూ వస్తూ అనారోగ్యం కారణంగా లొంగిపోయాడని వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు - మావోయిస్టుల తాజా వార్తలు భద్రాద్రి జిల్లా
మావోయిస్టు దళ సభ్యుడు ఎదుల్లా రామ్మూర్తి ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయాడు. 2019 నవంబర్ నుంచి మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పార్టీలో చేరాడని డీఎస్పీ తెలిపారు. అనారోగ్యం కారణంగా లొంగిపోయాడని వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు
మావోయిస్టు సభ్యులకు పోలీసులు ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలవాలని.. బూజుపట్టిన సిద్ధాంతాలను మానుకొని అభివృద్ధి దిశలో పయనించేలాని కోరారు. పోలీస్ స్టేషన్లు, జిల్లా ఎస్పీ సమక్షంలో గాని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు పోలీసులు సహకరిస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు