గతేడాది జూన్లో హన్మకొండలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దోషికి విధించిన యావజ్జీవ శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరణశిక్ష విధిస్తే... సమాజంలో నేరస్థులకు సరైన సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు తీర్పు కూడా దోషికి పూర్తిస్థాయిలో శిక్ష విధించినట్టుగానే ఉందన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.
'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే' - యావజ్జీవం కూడా ఉరితో సమానమన్న సుప్రీం

'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'
19:02 June 16
'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'
Last Updated : Jun 16, 2020, 8:06 PM IST
TAGGED:
SUPREME JUDGEMENT