ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామం వద్ద ఉత్తర ఫుడ్స్ కంపెనీలో పోతి మహేశ్ నాయక్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతనికి జూనియర్‌గా రమేశ్‌ను నియమించారు. ఈ క్రమంలో పని విషయంలో నిత్యం వేధిస్తున్నాడని.. మహేశ్‌ను రమేశ్ చంపేశాడు.
పనిలో వేధింపులు.. సీనియర్‌ను చంపిన జూనియర్.!
పనిలో వేధిస్తున్నాడని సూపర్వైజర్ను జూనియర్ హత్య చేసిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య, కర్నూలు, సూపర్వైజర్
రమేశ్.. తన తమ్ముడు, సమీప బంధువులు ఇద్దరితో కలిసి ఈ నెల 2న మహేశ్ ఇంటికి వెళ్లారు. అతనిపై వారు దాడి చేసి.. తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. పంచలింగాల వీఆర్వో దగ్గరకు వెళ్లి నిందితులు నేరం అంగీకరించారని వివరించారు. పోలీసులకు వీఆర్వో సమాచారం ఇవ్వటంతో.. వారిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ముగిసిన అఖిలప్రియ కస్టడీ... చంచల్‌గూడ జైలుకు తరలింపు