తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉపాధి దొరక్క యువకుడి బలవన్మరణం - నిర్మల్‌ జిల్లా నేర వార్తలు

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన వినోద్‌ మహమ్మారి వల్ల ఇటీవల స్వదేశానికి వచ్చాడు. పనులు లేకపోవడం, చేసిన అప్పు తీర్చే దారి దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.

Suicide of a young man who could not find employment
ఉపాధి దొరక్క యువకుడి బలవన్మరణం

By

Published : Dec 25, 2020, 1:50 PM IST

ఉపాధి దొరక్క మనస్తాపానికి గురై వినోద్ కుమార్ (23) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో జరిగింది. రెండేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన ఆ యువకుడు కరోనా కారణంగా పనులు లేకపోవడంతో ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చాడు.

జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుడు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చాడు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. గురువారం నిర్మల్ లో స్నేహితుని వివాహం ఉందని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు వినోద్‌ ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details