ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపడిగా గ్రామానికి చెందిన ఉడుత హరీశ్ (24) గత కొంత కాలంగా జనగామ జిల్లా దేవరుప్పులలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పని చేస్తున్నాడు.
రోజులాగే ఉద్యోగానికి వెళ్లిన హరీశ్.. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరులేని సమయం చూసి.. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.