భార్య ఆత్మహత్య చేసుకోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఆమె లేని ప్రపంంచంలో ఉండలేనంటూ తాను తనువు చాలించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన కనుగంటి సంతోశ్ (32) పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు.
భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా సమాచారం
వివాహం బంధం నూరేళ్ల జీవితానికి సాక్ష్యం. కష్టసుఖాలను పంచుకుంటూ సాగించే మధురఘట్టం. అలాంటి జీవితం మధ్యలోనే అంతమైతే ఆ బాధను అనుభవించడం చాలా కష్టం. భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ వక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. తాను లేని ఈ లోకంలో ఉండలేనంటూ ఆమె వద్దకే చేరాడు.
భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య
గత నెల 23 న పురుగుల మందు తాగి అపస్మాకర స్థితిలోకి చేరుకున్న అతన్ని హైదరాబాద్లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారని తెలిపారు. మృతునికి పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.