పోలీసులు తనను దౌర్జన్యంగా కొట్టారని ఆరోపిస్తూ... సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో జరిగింది. మంతటి గ్రామానికి చెందిన రాములుకు తన తల్లి, అన్నకు మధ్య భూమి అమ్మకం విషయమై గత కొంతకాలంగా వివాదం సాగుతోంది. తన తండ్రికి చెందిన భూమిలో తనకు రావాల్సిన వాటా ఏదని తల్లిని, అన్నను రాములు గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయంపై చిన్న కొడుకు రాములుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.
పోలీసులు కొట్టారంటూ ఆత్మహత్యాయత్నం... సెల్ఫీ వీడియో
తనకు రావాల్సిన భూమి గురించి తన తల్లి, అన్నను అడిగితే... పోలీసులు తీవ్రంగా కొట్టారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. స్టేషన్ పరిధిలోనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. తను చనిపోయిన తర్వాతైనా... తన పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలంటూ వీడియోలో వేడుకున్నాడు.
suicide attempt with selfie video in nagarkurnool police station
ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం రాములును పోలీసులు స్టేషన్కు పిలిచారు. అక్కడ పోలీసులు తనను తీవ్రంగా కొట్టి, వేధిస్తున్నారని ఆరోపిస్తూ... స్టేషన్ సమీపంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూనే పురుగుల మందు తాగి రాములు ఆత్మహత్యకు యత్నించాడు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గమనించి వెంటనే రాములును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాములు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తనకు ఎలాగైన న్యాయం చేయాలంటూ బాధితుడు రాములు కోరుతున్నాడు.