తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - మన్ననూరు గురుకుల పాఠశాల తాజా వార్తలు

పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో తమకు తెలియదని విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 6, 2020, 5:09 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని (16) శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ కుమార్తె బాగా చదువుకోవాలని సెప్టెంబర్​ 28న హాస్టల్​కు పంపామని తల్లిదండ్రులు తెలిపారు. బాలిక ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో తమకు తెలియదని.. పాఠశాల సిబ్బందే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థినికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తున్నారని.. అది ఇష్టం లేక శానిటైజర్​ తాగిందని పాఠశాల ప్రిన్సిపాల్​ తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చికిత్స నిమిత్తం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అమ్రాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన లారీ డ్రైవర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details