జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామం ఆర్టీసీ కాలనీకి చెందిన కొమ్మరాజుల యాదగిరి బైపాస్ రోడ్డులో ఎకరంన్నర భూమిని ఆరుగురు బిడ్డలకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు.
అదే గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మి తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిపై పెత్తనం చెలాయిస్తుందని వాపోయారు. ఈ విషయంపై గతంలో కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు. దాంతో ఆ భూమిలో కంది పంటను వేసుకున్నామని తెలిపారు.