తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చరవాణిలో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు ఆత్మహత్య

ఇసాక్‌ 15 ఏళ్ల యువకుడు. తరచూ చరవాణిలో ఆటలు ఆడుకునేవాడు. చరవాణిలో ఆటలు వద్దని తల్లి మందలించింది. ఇసాక్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో జరిగింది.

suicide at hafeez nagar For not playing games‌ in phone
చరవాణిలో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు ఆత్మహత్య

By

Published : Dec 17, 2020, 10:31 PM IST

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని హాఫీజ్‌ బాబానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లి చరవాణిలో గేమ్స్‌ ఆడనివ్వడంలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాఫీజ్‌ బాబానగర్‌ సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో ఇసాక్‌(15) అనే యువకుడు తరుచూ చరవాణిలో ఆటలు ఆడుతుండడంతో.. అతని తల్లి వద్దని చెప్పి మందలించింది.

మనస్తాపానికి గురైన ఇసాక్‌ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న కంచన్‌బాగ్‌ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వివాహితతో గొడవపడ్డాడు... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు

ABOUT THE AUTHOR

...view details