నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వాన్పూర్ విద్యుత్ ఉపకేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గంగాధర్ అనే ఆపరేటర్‌ను చితకబాది నగదు అపహరించుకుపోయారు.
సబ్‌స్టేషన్‌లో చోరీ: ఆపరేటర్‌ను చితకబాది నగదు అపహరణ - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు
నిజామాబాద్ జిల్లా కుద్వాన్పూర్ సబ్‌స్టేషన్‌లో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి విద్యుత్ ఉపకేంద్రంలోకి చొరబడిన దుండగులు.. ఆపరేటర్‌పై దాడికి పాల్పడి నగదు అపహరించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సబ్‌స్టేషన్‌లో చోరీ: ఆపరేటర్‌ను చితకబాది నగదు అపహరణ
శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు వచ్చి తలుపులు పగులగొట్టి తనపై కర్రలతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. గదిలోని వస్తువులు చిందరవందరగా పడేసి.. నగదును ఎత్తుకెళ్లారని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. పెట్రో మోసం... లీటరుకు 30 మి.లీ. తక్కువ పోసేస్తున్నారు!