తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.. 'ప్రేమ' కోణం? - జగిత్యాల జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Student suicide in jagtial district malyala mandal
విద్యార్థి ఆత్మహత్య... చంపేశారంటూ తల్లిదండ్రుల ఆరోపణ

By

Published : Dec 14, 2020, 3:36 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి జలంధర్ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని వెలికితీశారు. అదే గ్రామానికి చెందిన విద్యార్థినితో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. శవపరీక్ష కోసం మృతదేహన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం ఇంట్లో నుంచి అదృశ్యమైన విద్యార్థి ఇంటికి తిరిగి రాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావివద్ద అతని చెప్పులు కనిపించాయి. బావిలో వెతికి చూడగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చంపేశారు: విద్యార్థి తల్లిదండ్రులు

విద్యార్థిని కుటుంబ సభ్యుల బెదిరింపులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. చంపి బావిలో పడేశారని విద్యార్థి తండ్రి నాగేందర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజే ఆత్మహత్య చేసుకోగా... విద్యార్థి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి:హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details