ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి అశ్వక్ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అశ్వక్ రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే వెల్లడైన పరీక్ష ఫలితాల్లో అశ్వక్ ఫెయిల్ అయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రైలు కింద పడి విద్యార్థి బలవన్మరణం
పరీక్షల్లో తప్పానని ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది. రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న అశ్వక్.. ఇటీవలే వెల్లడైన పరీక్ష ఫలితాల్లో ఫెయిలయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పరీక్షల్లో తప్పానని రైలు కింద పడి బలవన్మరణం
మృతుని తండ్రి అజ్మతుల్లా రాయదుర్గంలో మున్సిపల్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడి ఆత్మహత్యతో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు మైసూర్ డివిజన్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి